ఫుట్ బాల్ లో రాటుదేలిన టీమిండియా క్రికెటర్లు... 41 కిక్ ల పాటు బంతి గాల్లోనే!

  • కొంతకాలంగా ఇతర ఆటలు ఆడుతున్న క్రికెటర్లు
  • ఫుట్ బాల్ పై పట్టుసాధించిన వైనం
  • వీడియో పోస్టు చేసిన బీసీసీఐ
టీమిండియా క్రికెటర్లు గతకొంతకాలంగా తమ మ్యాచ్ ప్రాక్టీసులో వ్యాయామంతో పాటు అనేకరకాల ఇతర క్రీడలను కూడా చేర్చారు. వాటిలో ఫుట్ బాల్ కూడా ఉంది. మొదట్లో సరదాగానే మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు ప్రొఫెషనల్ లెవల్ కు చేరింది. తాజాగా, వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ కోసం ప్రాక్టీసు సందర్భంగా భారత ఆటగాళ్లు ఎప్పట్లాగానే ఫుట్ బాల్ ఆడారు. బంతిని కిందపడకుండా 41 కిక్ ల పాటు గాల్లోనే ఉంచి తమ సాకర్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. లెగ్ కిక్ లు, హెడర్లతో ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టుచేసింది.

Go Back to Shorts
Team India
Foot Ball
Cricket

More Telugu News